తెలంగాణ

telangana

ETV Bharat / state

'టీ వాలెట్​'తో చౌక ధరల దుకాణాల్లో చెల్లింపులు

చౌక ధరల దుకాణాల డీలర్ల కోసం టీ వాలెట్​ డిజిటల్​ ట్రాన్సాక్షన్​ పీడీఎస్​ యాప్​ను పౌరసరఫరాల శాఖ అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో 17వేలకు పైగా దుకాణాల్లో వినియోగదారులు నగదు రహిత చెల్లింపులు చేసుకునేందుకు అందుబాటులోకి తెచ్చారు.

టీ వాలెట్​ యాప్​ను రేషన్ చెల్లింపులకు అనుసంధానం

By

Published : Jun 1, 2019, 11:44 PM IST

రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతకు పెద్దపీట వేసిన పౌరసరఫరాల శాఖ... టీ వాలెట్​ యాప్​ను రేషన్ చెల్లింపులకు అనుసంధానం చేసింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్​ డాక్టర్​ అకున్​ సబర్వాల్​తో కలిసి ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్​​ రంజన్​... సచివాలయంలోని తన ఛాంబర్​లో ప్రారంభించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్​ పేమెంట్స్​ చేయడానికి ఈ వాలెట్​ను రూపొందించినట్లు జయేశ్​ రంజన్​ తెలిపారు. త్వరలో టోల్​ప్లాజా చెల్లింపులకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.

టీ వాలెట్​ యాప్​ను రేషన్ చెల్లింపులకు అనుసంధానం

ABOUT THE AUTHOR

...view details