ETV Bharat / state
రేషన్‌కార్డులు తొలగించట్లేదు - HYDERABAD
'ఎక్కువ భూమి ఉండి రైతుబంధు చెక్కులు తీసుకుంటే రేషన్‌కార్డులు రద్దు చేస్తారంటా..! ఇక సరుకులు ఇవ్వరంటా..!' వదంతులను ఖండించింది పౌరసరఫరాలశాఖ.
వదంతులు నమ్మొద్దు..!
By
Published : Mar 6, 2019, 9:14 PM IST
| Updated : Mar 7, 2019, 12:16 AM IST
పది ఎకరాలకు మించి ఉన్న రైతుబంధు లబ్ధిదారుల రేషన్‌కార్డులను తొలగిస్తున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేని వెల్లడించింది. ప్రజలు ఆందోళన చెందొద్దని కమిషనర్ అకున్ సబర్వాల్ ఓ ప్రకటనలో తెలిపారు. రైతుల రేషన్‌కార్డులను తొలగించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. రేషన్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికీ సరుకులు పంపిణీ చేస్తామన్నారు. Last Updated : Mar 7, 2019, 12:16 AM IST