దివంగత అరుణోదయ రామారావు... గాయకుడిగా విప్లవ సాహిత్యానికి అందించిన సేవలు చిరస్మరణీయమని నిశాంత్ నాట్యమంచ్ దిల్లీ వ్యవస్థాపకుడు ఇస్లాం అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో రామారావు సంతాప సభ నిర్వహించారు. ఆయన మృతి కుటుంబానికి మాత్రమే కాదని విప్లవ సాహిత్యానికి తీరని లోటు అని అభివర్ణించారు. రామారావు ఎక్కడా శిక్షణ తీసుకోనప్పటికీ... ఎంతోమంది కళాకారులను సమాజానికి అందించారని గుర్తుచేసుకున్నారు. ఆయన సేవలను వామపక్ష, అభ్యుదయ వాదులు కొనసాగిస్తారని పేర్కొన్నారు.
'ఆయన మృతి విప్లవ సాహిత్యానికి తీరని లోటు' - arunodaya ramarao
దివంగత అరుణోదయ రామారావు సంస్మరణ సభ సుందరయ్య కళా నిలయంలో జరిగింది. రామారావు మృతి విప్లవ సాహిత్యానికి తీరని లోటుగా వక్తలు అభివర్ణించారు.
'ఆయన మృతి విప్లవ సాహిత్యానికి తీరని లోటు'
ఇవీ చూడండి: రాష్ట్రావతరణ వేడుకలు ఇకనుంచి అక్కడే!
Last Updated : May 18, 2019, 7:55 AM IST