మద్యం సేవించి బస్సును నడుపుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్‌పై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డు పుప్పాలగూడ టోల్గేట్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. శ్రీ కనక దుర్గ ట్రావెల్స్‌కు చెందిన బస్సును తనిఖీ చేయగా డ్రైవర్‌కు ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించగా... 216 పాయింట్లు వచ్చాయి. బస్సు 50 మంది ప్రయాణికులతో నగరం నుంచి కందుకూరు వెళ్తుతోంది. వెంటనే అప్రమత్తమైన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బస్సును సీజ్ చేశారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ప్రయాణికులకు పోలీసులు ప్రత్యామ్నాయ మార్గం ద్వారా గమ్యస్థానాన్ని చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
మద్యం సేవించి బస్సు నడిపిన డ్రైవర్ - drive
మద్యం సేవించి బస్సు నడుపుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌ను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి బస్సును సీజ్ చేశారు. ప్రయాణికులను వేరే మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చారు.
మద్యం సేవించి బస్సు నడిపిన డ్రైవర్