ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించడం, శాంతిభద్రతల పరిరక్షణ కోసం చేపట్టిన నిర్బంధ తనిఖీలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని కాచిగూడ ఏసీపీ సుధాకర్ తెలిపారు. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డెర బస్తీ, రైల్వే ట్రాక్ తదితర ప్రాంతాల్లో దాదాపు 150 మంది పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. స్థానికులతో మాట్లాడుతూ అనుమానితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సరైన పత్రాలు లేని దాదాపు 20 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ సుధాకర్ తెలిపారు. అనుమానితుల వివరాలను ఎప్పటికప్పుడు తమకు అందజేయాలని పోలీస్ అధికారులు ప్రజలకు సూచించారు.
నల్లకుంటలో పోలీసుల నిర్బంధ తనిఖీలు - search
హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించడం కోసం చేస్తున్న తనిఖీలకు అనూహ్య స్పందన వస్తోందని కాచిగూడ ఏసీపీ సుధాకర్ తెలిపారు.
![నల్లకుంటలో పోలీసుల నిర్బంధ తనిఖీలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3701518-1097-3701518-1561831801170.jpg)
నల్లకుంటలో పోలీసుల నిర్బంధ తనిఖీలు