తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. పోటీలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారం వేగవంతం చేసి ప్రజా, కుల, మహిళా సంఘాల నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. అధికార పార్టీ అభ్యర్థుల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్...కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా అధినేత రాహుల్, జాతీయ, రాష్ట్ర నాయకులు...భాజపా అభ్యర్థుల గెలుపు కాంక్షిస్తూ ప్రధాని మోదీ, జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం నిర్వహించారు.
సమయం లేదు మిత్రమా మిగిలింది ఈ ఒక్క రోజే - 2019 elections
ప్రచార గడువు ముగుస్తున్నందున అభ్యర్థులు వేగాన్ని పెంచారు. ఎత్తులు పై ఎత్తులతో ముందుకు వెళ్తుతున్నారు. పరిస్థితులను అంచనా వేసుకొని వ్యూహాలు మార్చుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రధాన పార్టీల నేతలంతా హోరెత్తిస్తున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా స్థానిక నేతలతో సమావేశమై పరిస్థితులు అంచనా వేస్తున్నారు. అనుకూల ప్రతికూలాంశాలు బేరీజు వేసుకుంటూ... అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. సాయంత్రానికి గడువు ముగియనున్నందున...ఇప్పటి వరకు అడుగుపెట్టని ప్రాంతాల్లో ప్రచారానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. వెళ్లే అవకాశం లేకపోతే స్థానిక నాయకులతో సంప్రదింపులు జరుపుతూ ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. అసెంబ్లీ, గత పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, ఇప్పుడున్న సమీకరణాల దృష్ట్యా లాభనష్టాలు అంచనా వేస్తున్నారు. సమయం వృథా చేయకుండా పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు.
ఇవీ చూడండి: పక్కా వ్యూహాలు... ప్రచార ప్రణాళికలతో ప్రజల్లోకి