తెలంగాణ

telangana

ETV Bharat / state

మురళీమోహన్​ను పరామర్శించిన చిరంజీవి - sick

తల్లి అస్థికలు నిమజ్జనం చేస్తూ అస్వస్థతకు గురైయ్యారు మురళీ మోహన్ . వైద్యులు ఆయనకు వెన్నెముక శస్త్ర చికిత్స చేశారు. చిరంజీవి దంపతులు మురళీమోహన్‌ను పరామర్శించారు.

మురళీమోహన్​కు చిరంజీవి పరామర్శ

By

Published : Jun 1, 2019, 5:16 PM IST

ప్రముఖ సీనియర్ నటుడు, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మురళీమోహన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మే 14న వారణాసిలో తన తల్లి అస్థికలు నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు లోనై నడవలేకపోయారు. కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు వెంటనే వెన్నెముకకు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన ప్రస్తుతం తన నివాసంలో కోలుకుంటున్నారు. మురళీ మోహన్ అనారోగ్య పరిస్థితి తెలుసుకున్న చిరంజీవి దంపతులు ఆయనను పరామర్శించారు. ఈ మేరకు మురళీమోహన్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. తన అభిమానులతోపాటు రాజమహేంద్రవరం ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని వీడియోలో కోరారు.

మురళీమోహన్​కు చిరంజీవి పరామర్శ

ABOUT THE AUTHOR

...view details