తెలంగాణ

telangana

ETV Bharat / state

'మున్సిపల్​ కాంట్రాక్ట్​ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి'

రాష్ట్రంలోని మున్సిపల్ కాంట్రాక్ట్​ ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సీఐటీయూ కార్మికులు హైదరాబాద్​లో ధర్నా నిర్వహించారు. రాబోయే పీఆర్సీలో కార్మికుల కనీస వేతనం రూ.24 వేలుగా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

'మున్సిపల్​ కాంట్రాక్ట్​ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి'

By

Published : Jun 28, 2019, 4:40 PM IST

కాంట్రాక్ట్​ ఔట్​సోర్సింగ్​ ఉద్యోగ కార్మికులందరిని పర్మినెంట్​ చేయాలంటూ సీఐటీయూ కార్మికులు ఈరోజు హైదరాబాద్​ నాంపల్లిలో ఉన్న పురపాలక పరిపాలన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా మున్సిపల్​ కార్మికులు ధర్నాలో పాల్గొన్నారు. పాత మున్సిపాలిటీలలో పని చేస్తున్న కార్మికులకు ఇస్తున్న వేతనాలనే కొత్త మున్సిపాలిటీలలో పని చేస్తున్న కార్మికులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో నూతనంగా ఏర్పడ్డ 75 మున్సిపాలిటీలలో జీఓ నెం.14ను అమలు చేయాలంటూ నినాదాలు చేశారు.

రాబోయే పీఆర్సీలో మున్సిపల్​ కార్మికుల కనీస వేతనం రూ.24 వేలుగా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని సీఐటీయూ రాష్ట్ర జనరల్​ సెక్రటరీ భాస్కర్​ డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్​ చేస్తూ వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే జూలై 4,5 తేదీల్లో సమ్మె చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

'మున్సిపల్​ కాంట్రాక్ట్​ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి'

ఇవీ చూడండి:'ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details