పురపాలక ఎన్నికల కసరత్తులో భాగంగా నేడు ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. కరీంనగర్, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లతో పాటు 129 మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. ఎన్నికలు జరగనున్న మూడు కార్పొరేషన్లలో 170వార్డులు, 129 మున్సిపాలిటీల్లో2979 వార్డులున్నాయి. జాబితా ముసాయిదా ప్రకటన అనంతరం రెండు రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఓటర్ల జాబితా ముసాయిదాపై నేడు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. అభ్యంతరాలు పరిష్కరించాక ఈ నెల 14వ తేదీన ఓటర్ల తుదిజాబితాను ప్రకటిస్తారు. అటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాల ముసాయిదా జాబితాను కూడా నేడు ప్రకటించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. 14వ తేదీన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల తుదిజాబితాను ప్రకటిస్తారు.
నేడే మున్సిపల్ ఓటర్ల జాబితా
రాష్ట్రప్రభుత్వం, ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తోన్నాయి. పురపాలక ఎన్నికల కరసత్తులో భాగంగా నేడు ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. కరీంనగర్, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లతో పాటు 129 మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు.
నేడే మున్సిపల్ ఓటర్ల జాబితా