దిల్లీలో యూఎన్ గ్లోబల్ కాంపాక్ట్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన లింగ సమానత్వ సదస్సు-2019 కితెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎంపీ కవిత హాజరయ్యారు. "భవిష్యత్లో మహిళలు అన్ని రంగాల్లో విధులు నిర్వర్తించేందుకు వారిని సన్నద్ధం చేయడం" అనే అంశంపై ఆమె ప్రసంగించారు. ఇలాంటి విషయాలపై చర్చిస్తూ ఉంటే ఏదో ఒక రోజు అవి తప్పకుండా అమలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్పొరేట్ సెక్టార్లలో మహిళల నియామక శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మాకూ ఓ ఛాన్స్ ఇవ్వండి
పురుషులతో సమానంగా మహిళలు పని చేయడానికి సరైన అవకాశాలు కల్పించడంలో కార్పొరేట్ సంస్థలు ముఖ్య భూమిక పోషించాలని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత