ప్రజాసేవకే అంకితం - mlas
ముఖ్యమంత్రి కేసీఆర్ తమపై నమ్మకంతో కేటాయించిన మంత్రి పదవులను ప్రజాసేవకు ఉపయోగించుకుంటామని కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి
మంత్రి పదవిని ప్రజాసేవకు ఉపయోగించుకుంటానని ధర్మపురి శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్ తెలిపారు. పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ ముఖ్యమంత్రి గౌరవాన్ని కాపాడుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి తనపై నమ్మకంతో ఇచ్చిన పదవిని సైనికునిగా పని చేసి నిరూపించుకుంటానని వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్‌రెడ్డి తెలిపారు. గతంలో ప్లానింగ్ కమిటీ ఉపాధ్యక్షునిగా పనిచేసిన అనుభవం ఇప్పుడు అప్పగించిన మంత్రి పదవికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.