అన్ని ఇళ్లకు సమాన స్థాయిలో తాగు నీరు అందించడం గొప్ప విషయం అని కేంద్ర తాగునీటి సరఫరా విభాగం ఉప సలహాదారుడు రాజశేఖర్ అన్నారు. క్షేత్రస్థాయిలో రెండు రోజుల పాటు మిషన్ భగీరథ శుద్ధి కేంద్రాలు, తాగునీరు సరఫరా అవుతున్న నివాసాలను పరిశీలించిన రాజశేఖర్, ఎర్రమంజిల్ ప్రాంతంలోని భగీరథ కార్యాలయంలో ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ప్రాజెక్టు లక్ష్యాలను ఈఎన్‌సీ ఆయనకు వివరించారు. భగీరథ పురోగతిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పలు విషయాలు తెలియజేశారు. గతంలో కొన్ని రాష్ట్రాలు తాగునీటి పథకాలను ప్రారంభించినా కొన్ని గ్రామాలకే పరిమితమయ్యాయని రాజశేఖర్ తెలిపారు. అయితే మిషన్ భగీరథతో సుమారు 24 వేల గ్రామాలకు నీళ్లు అందించడం అభినందనీయమన్నారు. భగీరథలో నిర్మించిన నీటి శుద్ధి కేంద్రాలు బాగా పనిచేస్తున్నాయని, ఇవే ప్రమాణాలను పాటించాలని ఆయన సూచించారు.
'24 వేల గ్రామాలకు నీరందించడం గొప్ప విషయం' - flagship
తెలంగాణ ప్రతిష్ఠాత్మక పథకం మిషన్ భగీరథను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు కేంద్ర తాగునీటి సరఫరా విభాగం ఉప సలహాదారుడు రాజశేఖర్. 24 వేల గ్రామాలకు నీటిని సరఫరా చేయడం గొప్ప విషయమని కొనియాడారు.
'24 వేల గ్రామాలకు నీరందించడం గొప్ప విషయం'