తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొడంగల్​లో చెల్లనిది.. లాల్​బజార్​లో చెల్లుతుందా?' - ktr

మల్కాజిగిరి నియోజకవర్గంలోని లాల్​బజారులో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో విపక్షాలపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొడంగల్​లోనే చెల్లని నోటు లాల్​బజారులో చెల్లుతుందా.. మల్కాజ్​గిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్​రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.

మల్కాజిగిరి కాంగ్రెస్​ అభ్యర్థి రేవంత్​రెడ్డిపై వ్యంగ్యస్త్రాలు

By

Published : Mar 23, 2019, 10:31 PM IST

Updated : Mar 24, 2019, 8:57 AM IST

ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్​, భాజపా రెండూ కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ లాల్​బజారులో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మల్కాజిగిరి కాంగ్రెస్​ అభ్యర్థి రేవంత్​రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ''కొడంగల్​లో చెల్లని నోటు లాల్​బజారులో చెల్లుతుందా? కొడంగల్​లో రాలిపోయిన పువ్వును మల్కాజిగిరిలోకి తెచ్చుకుని పూజించుకుంటామా?'' అని ప్రశ్నించారు. ఎన్నికలు పూర్తవగానే కంటోన్మెంట్​ పరిధిలోని పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

రేవంత్​ ​రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు
Last Updated : Mar 24, 2019, 8:57 AM IST

ABOUT THE AUTHOR

...view details