తెలంగాణ

telangana

ETV Bharat / state

కళ్లలో కారం కొట్టి... కన్నవారిపై కుమారుడి దాడి - కన్నవారిపై కుమారుడి దాడి

పండు ముదుసలి అని కనికరం లేదు. కన్న తండ్రి అన్న ప్రేమ లేదు సరికదా మానవత్వం మరిచి మృగంలా ప్రవర్తించాడో కుమారుడు. కోడలి పేరిట ఉన్న స్థలాన్ని అమ్మేసి అప్పులు తీర్చాలనుకోవడమే తప్పైంది. 85 ఏళ్ల వృద్ధుడని చూడకుండా కళ్లలో కారం కొట్టి...ఇనుపరాడ్డుతో దాడి చేశాడా ప్రబుద్ధుడు.

కళ్లలో కారం కొట్టి... కన్నవారిపై కుమారుడి దాడి

By

Published : Jun 4, 2019, 4:16 PM IST

ఆస్తి తగాదాలు కుటుంబంలో చిచ్చు రేపాయి. మానవత్వం మరచిన కుమారుడు... కన్నవారిపైనే కత్తి దూశాడు. వృద్ధులని కనికరం లేకుండా విచక్షణ రహితంగా దాడి చేసి... కుమారుడనే పేరుకే మచ్చ తీసుకొచ్చాడు. తిరుపతిలో జరిగిన ఈ దుర్ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

తిరుపతిలోని అనంతవీధిలో నివసించే... 85 ఏళ్ల వృద్ధుడు మునికృష్ణయ్య దంపతులపై పెద్దకుమారుడు విజయ్, భార్య, బావమరిదితో కలిసి దాడి చేశాడు. కారంపొడి చల్లి ఇనుప రాడ్డుతో మోదాడు. కోడలి పేరిట ఉన్న 2 సెంట్ల స్థలాన్ని అప్పుల కోసం అమ్మాలనుకోవడమే తప్పైంది. ఈ నిర్ణయంతో ఆగ్రహానికి గురైన కుమారుడు, కోడలు... విచక్షణ కోల్పోయిన ఆ వృద్ధ దంపతులపై దాడి చేశారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన బావమరిది... విజయ్‌కు సహకరించాడు. ఈ ముగ్గురి చర్య స్థానికులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది.

కళ్లలో కారం కొట్టి... కన్నవారిపై కుమారుడి దాడి

ABOUT THE AUTHOR

...view details