సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు జి.కిషన్ రెడ్డి ఇవాళ సాయంకాలం 7 గంటలకు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీకి, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఆశీర్వాదం, సికింద్రాబాద్ ప్రజల సహకారమే కారణమని ట్వీట్ చేశారు. ఈ ప్రోత్సాహం, ఆదరణ ఇదే విధంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రజల ప్రోత్సాహం ఇలానే కొనసాగాలి: కిషన్ రెడ్డి - modi
ఇవాళ సాయంత్రం కేంద్రమంత్రిగా ప్రమాణం చేయనున్న కిషన్ రెడ్డి... నరేంద్ర మోదీకి, సికింద్రాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల ప్రోత్సాహం ఇలానే కొనసాగాలని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణం