తెలంగాణ

telangana

ETV Bharat / state

విజయనిర్మల భౌతికకాయానికి కేసీఆర్ నివాళి - kcr

నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్ విజయనిర్మల భౌతికకాయానికి నివాళి అర్పించారు. తదనంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు భౌతిక దేహనికి శ్రద్ధాంజలి ఘటించారు.

విజయనిర్మల భౌతికకాయానికి కేసీఆర్ నివాళి

By

Published : Jun 27, 2019, 6:15 PM IST

Updated : Jun 27, 2019, 6:40 PM IST

విలక్షణ నటి, ప్రజ్ఞాశాలి విజయనిర్మల భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ భవన్ నుంచి నేరుగా నానక్రాంగూడలోని కృష్ణ నివాసానికి చేరుకున్న కేసీఆర్ ... విజయ నిర్మల పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. విజయ నిర్మల భౌతికకాయం పక్కన విషణ్ణవదనంలో ఉన్న కృష్ణను దగ్గరకు తీసుకొని పరామర్శించారు. నరేష్తో పాటు కుటుంబ సభ్యులను పేరుపేరున పలకరించిన కేసీఆర్ ... విజయ నిర్మల హఠాన్మరణం పట్ల సంతాపం తెలిపారు. కేసీఆర్ వెంట మంత్రులు తలసాని, ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్తో పాటు ఎంపీలు కేకే, సంతోష్ కుమార్ , రంజిత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు హాజరై విజయనిర్మల పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. సుమారు 20 నిమిషాలపాటు కృష్ణ నివాసంలోనే ఉన్న కేసీఆర్ ... కుటుంబ సభ్యులను ఓదార్చి వెళ్లారు.

విజయనిర్మల భౌతికకాయానికి కేసీఆర్ నివాళి
Last Updated : Jun 27, 2019, 6:40 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details