తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖాతా ఇవ్వలేదని చంపేశాడు - prithvi

హైదరాబాద్​ జూబ్లీహిల్స్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో దారుణం జరిగింది. సరుకులు ఉద్దెర ఇవ్వలేదని దుకాణం యజమాని ప్రాణాలు తీసేశాడు. మద్యం మత్తులో ఉండి పృథ్వి అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశాడు.

జూబ్లీహిల్స్​ పరిధిలో హత్యకు గురైన పృథ్వి

By

Published : Mar 11, 2019, 12:49 PM IST

హైదరాబాద్​ జూబ్లీహిల్స్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని రహ్మత్​ నగర్​లో ఘోరం చోటుచేసుకుంది. డేవిడ్​ అనే వ్యక్తి పృథ్వి అనే కిరాణా దుకాణం యజమానిని కత్తితో పొడిచి చంపాడు.

ఎందుకు చంపాడు?

దుకాణంలో సరుకులు ఉద్దెర ఇవ్వనందుకు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయమై పృథ్వి జూబ్లీహిల్స్​ ఔట్​పోస్ట్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోలేదు. డేవిడ్​ మద్యం మత్తులో ఉండి పృథ్విని కత్తితో పొడిచి చంపాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండిఃప్రమాదంలో నూతన దంపతుల మృతి

ABOUT THE AUTHOR

...view details