తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్టార్టప్​లు పెట్టేందుకు యువత ముందుకు రావాలి' - park hayat

అంకుర పరిశ్రమలకు ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అన్ని విధాల అండగా నిలుస్తోంది. యువత ముందుకు వస్తే టీహబ్​లో స్టార్టప్​లు ఉచితంగా పెట్టుకునే అవకాశం కల్పిస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు.

అంకుర పరిశ్రమలకు ప్రభుత్వం చేయూతనిస్తోంది

By

Published : Apr 14, 2019, 11:26 AM IST

పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు విశ్వవిద్యాలయాల్లోనే నేర్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అన్నారు. హైదరాబాద్​లోని ఓ హోటల్​లో ద కాంక్లేవ్ ఎడ్జ్‌స్పైర్‌ కార్యక్రమానికి ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్​తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అవకాశాలను అందింపుచ్చుకునేలా... యువత నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలని సూచించారు. స్టార్టప్‌లు పెట్టేందుకు ముందుకు వస్తే... టీహబ్​లో ఉచితంగా అవకాశం కల్పిస్తామని జయేష్ రంజన్ తెలిపారు.

అంకుర పరిశ్రమలకు ప్రభుత్వం చేయూతనిస్తోంది

ABOUT THE AUTHOR

...view details