తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ పాకశాస్త్ర నిపుణుల సంఘం ఏర్పాటు - telangana

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టార్​ హోటళ్లలో, రెస్టారెంట్లలో పని చేస్తున్న పాకశాస్త్ర నిపుణులందరూ కలిసి తెలంగాణ చెఫ్స్​ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​ రంజన్​ హాజరయ్యారు. పాకశాస్త్ర రంగం మరింత అభివృద్ధి పరిచేలా కృషి చేయాలన్నారు.

తెలంగాణ పాకశాస్త్ర నిపుణుల సంఘం ఏర్పాటు

By

Published : Apr 24, 2019, 12:35 PM IST

Updated : Apr 24, 2019, 3:21 PM IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు స్టార్​ హోటళ్లలో, ఫైన్​డైన్ రెస్టారెంట్లలో పనిచేస్తున్న పాకశాస్త్ర ప్రావీణులందరూ కలిసి తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్​లోని విద్యానగర్​లో ఉన్న ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ హోటల్ మేనేజ్​మెంట్​లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ జయేష్​ రంజన్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ పాకశాస్త్ర నిపుణుల ప్రత్యేక సంఘాన్ని, వెబ్​సైట్​ను ప్రారంభించారు. హైదరాబాద్​తో పాటు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన పాకశాస్త్ర నిపుణులు ఇందులో పాల్గొన్నారు.

తెలంగాణ పాకశాస్త్ర నిపుణుల సంఘం ఏర్పాటు

జయేష్ రంజన్ మాట్లాడుతూ... తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ తన ప్రయాణంలో పూర్తి విజయాన్ని సాధిస్తుందన్నారు. రాష్ట్రంలో పాకశాస్త్ర రంగాన్ని మరింత అభివృద్ధిపరిచే దిశగా పనిచేస్తూ... యువతలో నైపుణ్యం పెంచి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పని చేయాలని సూచించారు.

రాష్ట్రంలో పనిచేస్తున్న పాకశాస్త్ర నిపుణులను, ఆహార పరిశ్రమలో పని చేస్తున్నవారందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని అధ్యక్షుడు ధర్మేంద్ర లాంబ పేర్కొన్నారు. సరికొత్త వంటకాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు వీలు కల్పించడం కోసమే దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వంద మందికిపైగా పాకశాస్త్ర ప్రావీణులు ఆహార సంబంధిత పరిశ్రమల ప్రతినిధులు, పరికరాల సంస్థ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ఆదిలాబాద్​లో టీఆర్టీ అభ్యర్థుల ఆందోళన

Last Updated : Apr 24, 2019, 3:21 PM IST

ABOUT THE AUTHOR

...view details