తెలంగాణ

telangana

ETV Bharat / state

వేటాడితే వేటే - janutuvula veta

వన్యప్రాణుల సంరక్షణలో అటవీశాఖ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఏ ఒక్క జంతువు బలి కాకూడదని, దానికి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

విద్యుత్​ తీగలతో జంతువులకు ఉచ్చు

By

Published : Feb 8, 2019, 6:36 AM IST

Updated : Feb 9, 2019, 7:09 AM IST

విద్యుత్​ తీగలతో జంతువులకు ఉచ్చు
అటవీ ప్రాంతాల్లో అక్రమ వేటను అరికట్టాలని హైకోర్టు ఆదేశించింది. వేటగాళ్లు వన్యప్రాణుల్ని మట్టుపెట్టడం కోసం వినియోగిస్తున్న విద్యుత్​ ఉచ్చుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ టీబీఎన్​ రాధాకృష్ణన్​, జస్టిస్​ రాజశేఖర్​ రెడ్డిలతో కూడిన ధర్మాసనం పులుల సంరక్షణ పథకం పక్కాగా అమలు చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది.

అటవీ ప్రాంతాల్లో అనుమతి లేకుండా విద్యుత్​ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అటవీ, జంతు సంరక్షణ, ఎక్సైజ్,​ నార్కోటిక్ చట్టాలను కఠినంగా అమలు పరచాలని.. పర్యవేక్షణకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించింది.

కవ్వాల్, ఆమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రాల్లో పులుల పరిరక్షణకు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేయాలని హైకోర్టు అటవీ అధికారులకు సూచించింది. ఫారెస్ట్ గార్డులు, అటవీశాఖ రక్షణ సిబ్బందికి ఆయుధాల వినియోగానికి అనుమతించాలని పేర్కొంది.

విద్యుత్​ లైన్లకు ఇన్సులేషన్​ చేయాలన్న ఆటవీశాఖ అధికారుల సూచనలు అమలు చేయాలని విద్యుత్​ శాఖకు సూచించింది. అక్రమ విద్యుత్​ వినియోగంలో భాగంగా కొక్కేలు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది. తనిఖీలు చేసి భవిష్యత్​ కార్యాచరణ నిమిత్తం నివేదిక ఇవ్వాలని పలు జిల్లాల అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.

Last Updated : Feb 9, 2019, 7:09 AM IST

ABOUT THE AUTHOR

...view details