తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​ కోచింగ్​ సెంటర్లపై జీహెచ్​ఎంసీ కొరడా...!

ఇటీవల సూరత్​లో కోచింగ్​ సెంటర్​లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనతో జీహెచ్​ఎంసీ అప్రమత్తమైంది. ఇవాళ జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిషోర్​ అమీర్​పేటలోని మైత్రివనంలో పారిశుధ్య పరిరక్షణ కార్యక్రమం నిర్వహించి.. ఫైర్​ సేఫ్టీ అనుమతులు లేని కోచింగ్​ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్​ కోచింగ్​ సెంటర్లపై జీహెచ్​ఎంసీ కొరడా

By

Published : Jun 1, 2019, 1:37 PM IST

జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ శనివారం ఉదయం స్థానిక అమీర్​పేటలో పారిశుధ్య పరిరక్షణలో భాగంగా మైత్రివనం వద్ద పర్యటించారు. ఈ సందర్భంగా కోచింగ్​ సెంటర్లు, దుకాణాలు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సిబ్బందితో తొలగింపజేశారు.
దానకిషోర్​ ఆకస్మిక పర్యటనలో మైత్రివనంలోని కోచింగ్ సెంటర్లపై కొరడా ఝలిపించారు. భద్రతా ప్రమాణాలు పాటించని, అగ్నిమాపక అనుమతులు లేకుండా ఉన్న బిల్డింగ్ యజమాను​లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తప్పనిసరిగా కోచింగ్ సెంటర్​లు ఫైర్ సేఫ్టీ అనుమతులు పొందాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని దానకిషోర్​ హెచ్చరించారు.

హైదరాబాద్​ కోచింగ్​ సెంటర్లపై జీహెచ్​ఎంసీ కొరడా...!
అనంతరం మైత్రివనంలో అధికారులతో పాటు పర్యటిస్తూ అనుమతి లేని హోర్డింగులు, ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అదేవిధంగా కోచింగ్ సెంటర్లలో తప్పనిసరిగా తనిఖీలు చేయాలని అధికారులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details