తన పాటలు, రచనల ద్వారా తాడిత, పీడిత పక్షాన గళమెత్తి జనజాగృతి చేసిన వ్యక్తి గద్దర్ అని పలువురు వక్తలు అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రాజ్ఞిక ఫౌండేషన్, ప్రాజ్ఞిక ఆర్ట్స్ అకాడమీ, సీల్‌వెల్ కార్పొరేషన్ సంయుక్తంగా... సంగీత సాహిత్య సమలంకృతే పేరిట ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. విప్లవ గాయకుడు గద్దర్‌ను కొమురం భీం పురస్కారంతోపాటు విప్లవ యోధాగ్రేసర్ బిరుదుతో సత్కారించారు. ప్రముఖ గాయనీ, నంది అవార్డు గ్రహిత వీఏ లక్ష్మీకి స్వరమంజరి బిరుదు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శక, నిర్మాత, నటుడు ఆర్ నారాయణమూర్తి, సినీ నటుడు జీవీ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
కొమురం భీం పురస్కారం... యోధాగ్రేసర్ బిరుదు - yodha gracer
ప్రజా యుద్ధనౌక గద్దర్‌ను కొమురం భీం పురస్కారం, విప్లవ యోధాగ్రేసర్ బిరుదుతో రవీంద్రభారతిలో సత్కరించారు. ప్రజల పక్షాన గళమెత్తిన విప్లవ యోధుడిగా గద్దర్ని వక్తలు అభివర్ణించారు.
కొమురం భీం పురస్కారం... యోధాగ్రేసర్ బిరుదు
Last Updated : Jun 20, 2019, 7:45 AM IST