'ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారమే లక్ష్యం' - etala
ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చర్చలు జరిగాయన్నారు మంత్రి ఈటల రాజేందర్. దేశంలోనే గొప్ప వ్యవసాయ రాష్ట్రాలుగా తెలంగాణ, ఏపీ ఎదగాలన్నదే మా ఆశయమని ఆయన స్పష్టం చేశారు.
సరిపడా సాగునీరు, తాగునీరు లేక తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు మంత్రి ఈటల రాజేందర్. ప్రగతి భవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించిన అంశాలపై ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్‌తో కలిసి వివరించారు. చిన్నచిన్న సమస్యలతో పాటు సాగునీటి సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. ఇరు రాష్ట్రాల్లోని పంటపొలాలకు నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఇరువురు ముఖ్యమంత్రులు ఆదేశించారని తెలిపారు. దేశంలోనే గొప్ప వ్యవసాయ రాష్ట్రాలుగా తెలంగాణ, ఏపీ ఎదగాలనేది ముఖ్యమంత్రుల ఆశయమని స్పష్టం చేశారు. ఇవాళ్టి భేటీ కొనసాగింపుగా రేపు ఉన్నతాధికారులు సమావేశం జరుగుతుందని చెప్పారు.