కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్‌లో 7వ రాష్ట్రస్థాయి ఆర్థిక గణనపై కార్యశాల నిర్వహించారు. బేగంపేట సెస్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర నోడల్ అధికారులు, ఎన్ఎస్ఎస్ఓ, సీఎస్సీ అధికారులు హాజరయ్యారు. 2019 ఆర్థిక సంవత్సరంలో చేయనున్న 7వ ఆర్థిక గణనకు సంబంధించి సమాచార సేకరణపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఆర్థిక గణనలో మొదటి సారిగా చరవాణి ఆధారిత అప్లికేషన్ ద్వారా దేశ భౌగోళిక స్థిర, చరాస్తుల సమాచారాన్ని సేకరించనున్నారు. రియల్‌టైమ్ వాలిడేషన్ కోసమే ఈ పద్ధతిని అనుసరిస్తున్నట్లు వక్తలు తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే సర్వే నిర్వాహకులకు జూన్‌లో జిల్లా స్థాయి శిక్షణ ఉంటుందని ఎన్ఎస్ఎస్ఓ ప్రతినిధులు పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో 7వ ఆర్థిక గణన కార్యశాల - hyderabad
కేంద్ర గణాంక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఆర్థిక గణనలో మొదటిసారిగా మొబైల్ అప్లికేషన్ ద్వారా సమాచారాన్ని సేకరించనున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో 7వ ఆర్థిక గణన కార్యశాలలో రాష్ట్రస్థాయి అధికారులకు కేంద్ర బృందం శిక్షణ ఇచ్చారు.
హైదరాబాద్‌లో 7వ ఆర్థిక గణన కార్యశాల