సరళతర వాణిజ్య సంస్కరణల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి ఆయా శాఖల నివేదికలు ఈ నెల 15లోపు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సరళతర వాణిజ్య విధానంపై సమీక్షించారు. నివేదికలతో పాటు వినియోగదారుల జాబితాను నిర్ధిష్ట నమునాలో అందజేయాలని స్పష్టం చేశారు.
'సరళతర వాణిజ్య సంస్కరణలు వేగవంతం చేయాలి' - cs sk joshi
సరళతర వాణిజ్య సంస్కరణల కార్యాచరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. ఈ నెల 15లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
వాణిజ్య సంస్కరణలు వేగవంతం చేయాలి
కమర్షియల్ కోర్టుల ఏర్పాటు, ఆన్లైన్ పోర్టల్లో వివరాల నమోదు, ఆన్లైన్లో కేసుల ఫైలింగ్, సివిల్ కోర్టుల వివరాలు అనుసంధానం, సింగిల్ విండోలో పరిశ్రమ నిర్మాణ అనుమతులు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. వినియోగదారులను చైతన్యం చేయాలని పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. డిసెంబర్ 2018 నుంచి 31 మార్చి 2019 వరకు వివిధ శాఖల నుంచి లబ్ధిపొందిన వినియోగదారుల వివరాలు అందించాలని తెలిపారు.
ఇవీ చూడండి: పరిషత్ అధ్యక్షుల ఎన్నిక సమన్వయానికి తెరాస ఇంఛార్జీలు
Last Updated : Jun 4, 2019, 12:03 AM IST