తెలంగాణ

telangana

ETV Bharat / state

కలిసికట్టుగా కామ్రేడ్స్... సందిగ్ధంలో కోదండరాం - communist parties

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమిగా జతకట్టిన పక్షాలు పార్లమెంటు పోరు నాటికి కకావికలమయ్యాయి. పోటీ చేయాలా? లేక పాత మిత్రులకు మద్దతివ్వాలా? అనే సందిగ్ధంలో ఉన్నాయి. కమ్యూనిస్టులు పోటీ చేయని స్థానాల్లో ఏ నిర్ణయం తీసుకోవాలనేదానిపై ఇరు పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ జనసమితి ఎటూ తెల్చుకోలేకపోతోంది.

ఎన్నికల పొత్తులపై సందిగ్ధం

By

Published : Mar 24, 2019, 6:07 PM IST

Updated : Mar 25, 2019, 1:03 AM IST

ఎన్నికల పొత్తులపై సందిగ్ధం
తెలంగాణలో లోక్​సభ ఎన్నికల్లోతెరాస, కాంగ్రెస్​లే ప్రధానంగా తలపడే అవకాశం ఉన్నప్పటికీ... భాజపా కూడా అన్ని స్థానాల్లో పోటీకి సై అంటోంది. కమ్యూనిస్టులు చెరో రెండు స్థానాల్లో బరిలో దిగుతున్నారు. తెజస నాలుగు చోట్ల పోటీ చేస్తామని చెప్పినా.. ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. సోమవారంతో నామినేషన్ల గడువు ముగుస్తున్నందున ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది.

బలమున్నచోటే బరిలోకి కామ్రేడ్స్​

వేర్వేరుగా పోటీ చేసి అస్థిత్వాన్ని కోల్పోయే కంటే... జట్టుగాపోటీ చేసి ఉనికి కాపాడుకోవాలని కమ్యూనిస్టులు నిర్ణయించుకున్నారు. మొదటి నుంచి పట్టున్న ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బరిలో ఉండాలని భావించారు. ఖమ్మంలో వెంకట్, నల్గొండ నుంచి మల్లు లక్ష్మిని సీపీఎం బరిలో నిలిపింది. సీపీఐకి కేటాయించిన భువనగిరిలో గోదా శ్రీరాములు, మహబూబాబాద్​లో కల్లూరి వెంకటేశ్వర రావును అభ్యర్థులుగా ఖరారు చేశారు. మిగతా చోట్ల కాంగ్రెస్​కు మద్దతిచ్చేందుకు సీపీఐ ప్రతిపాదించగా... సీపీఎం విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వామపక్ష అభ్యర్థుల తరఫున సీపీఎం, సీపీఐ ప్రధానకార్యదర్శులు సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డి, ముఖ్యనేతలు ప్రకాశ్‌ కరాత్‌, బృందాకరాత్, రాఘవులు, నారాయణ ప్రచారంలోపాల్గొననున్నారు.

తేల్చుకోలేకపోతున్న ప్రొఫెసర్

నాలుగు స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన తెజస... ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. మల్కాజిగిరి, నిజామాబాద్, కరీంనగర్​లో బరిలో ఉండేందుకు ప్రాథమికంగా నిర్ణయించింది. నాలుగో స్థానంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి మద్దతివ్వాలని కోరగా... నాయకత్వం పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఉనికి చాటాలంటే కొన్ని స్థానాల్లోనైనా పోటీ చేయాల్సిందేనని కొందరు... ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కాంగ్రెస్​కు సహకరించాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. జనసమితి పోటీపై ఆదివారం రాత్రి వరకుస్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇవీ చూడండి:ఖమ్మంలో గులాబీ 'నామా'మృతం

Last Updated : Mar 25, 2019, 1:03 AM IST

ABOUT THE AUTHOR

...view details