తెలంగాణ

telangana

ETV Bharat / state

నేతల వలసలతో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి - 2019 elections

అసలే ఎన్నికల్లో ఘోర పరాజయం. ఆపై ఎమ్మెల్యేల ఫిరాయింపులు. ఇప్పుడేమో నేతల వలసలతో తెలంగాణలో కాంగ్రెస్ కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది. కేంద్రంలో అధికారమే లక్ష్యంగా పార్లమెంటు బరిలో దిగుతున్న హస్తం పార్టీకి అడుగడుగునా అడ్డంకులే. తాజా ఎమ్మెల్సీ పలితాల ఆనందాన్ని మరవక ముందే మళ్లీ వలసల పర్వం మొదలైంది.

కాంగ్రెస్​లో కొనసాగుతున్న వలసలు

By

Published : Apr 1, 2019, 10:59 AM IST

కాంగ్రెస్​లో కొనసాగుతున్న వలసలు
మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడ్డట్టుంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. ఇప్పటికే అసెంబ్లీ ఫలితాలతో తేరుకోలేకపోతుంటే... రోజుకో నేత పార్టీ వీడుతున్నారు. ఎమ్మెల్యే ఫిరాయింపులకు తాత్కాలికంగా బ్రేకు పడినా.. నేతలు మాత్రం గోడదూకుతూనే ఉన్నారు. అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్​తో హస్తం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటి వరకు 10మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ వీడుతున్నట్టు ప్రకటించారు. అవసరమైతే రాజీనామా చేసి తెరాస తరఫున పోటీ చేస్తామనీ స్పష్టం చేశారు. కానీ ఏ ఒక్కరూ రాజీనామా చేయలేదు, తెరాసలోనూ చేరలేదు. సీఎల్పీ విలీనానికి కావాల్సిన సంఖ్య చేరే వరకు వేచి చూడాలన్నది గులాబీ దళం వ్యూహంగా తెలుస్తోంది. తాత్కాలికంగా కొంత విరామం వచ్చినా... పొంగులేటి సుధాకర్ రెడ్డి రాజీనామాతో మళ్లీ వలసలు పర్వం ఊపందుకున్నట్లు కనిపిస్తోంది.

నష్టనివారణ చర్యలేవీ...?

ఎమ్మెల్యేలు, నేతలు పార్టీ వీడుతున్నా... ఇప్పటికీ రాష్ట్రనాయకత్వం నష్ట నివారణ చర్యలు తీసుకోకపోవడం శ్రేణులను కలవరపరుస్తోంది. ఆత్రం సక్కు, రేగా కాంతారావు వీడినప్పుడే మిగతా వారితో మాట్లాడితే ప్రయోజనం ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేలు, సునీతా లక్ష్మారెడ్డి, బూడిద బిక్షమయ్య గౌడ్ అధికార తెరాసలో, డీకే అరుణ భాజపాలో చేరారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రధాని మోదీని కలిసి మంతనాలు జరిపారు. ఈరోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే భాజపా సభలో మోదీ సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.

ఇవీ చూడండి:తెలంగాణలో మంత్రులకు లోక్​సభ పరీక్ష...!

ABOUT THE AUTHOR

...view details