తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో కారుపై చేయి ఎత్తుగడ - rahul meetimg

ఆలస్యమైతే అమృతం కూడా విషమవుతుందని కాంగ్రెస్ నాయకత్వానికి అసెంబ్లీ ఎన్నికలతో తెలిసొచ్చింది. అందుకే తెరాస కన్నా ముందే పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్తోంది. జాతీయ అంశాలతో మెజార్టీ సీట్లు గెల్చుకునేందుకు రాహుల్, ప్రియాంక, సీనియర్ నేతలను రంగంలోకి దించుతోంది.

తెలంగాణలో కాంగ్రెస ప్రచార వ్యూహాలు

By

Published : Mar 25, 2019, 9:41 PM IST

తెలంగాణలో కాంగ్రెస ప్రచార వ్యూహాలు

జాతీయ అంశాలే ఎజెండా

అధికార పార్టీకి గట్టి పోటీ నిచ్చేందుకు ఉద్దండులను ఎంచుకుంది కాంగ్రెస్. గతంలో లోక్​సభకు ప్రాతినిధ్యం వహించిన తొమ్మిది మంది మాజీలను బరిలో దింపింది. విభజన సమస్యలు, మహిళా బిల్లు, పేదల కనీస ఆదాయ హామీ పథకం, బ్యాంకు, రఫేల్ కుంభకోణాలను అస్త్రాలుగా చేసుకుంటోంది. భాజపా వైఫల్యాలను ఎండగట్టాలనుకుంటోంది. తెరాసకు ఓటేస్తే ఒరిగేదేమి లేదని..కేంద్రంతో ముడిపడి ఉన్న సమస్యల పరిష్కారం జాతీయ పార్టీలతోనే సాధ్యమని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.

రాహుల్, ప్రియాంక ప్రచారాలు

చేవెళ్ల పరిధిలోని శంషాబాద్ నుంచి రాహుల్ ఎన్నికల శంఖారావం పూరించారు. భారీ స్పందన రావడంతోప్రతి సెగ్మెంట్లో ఓ సభకు రాహుల్ హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రియాంక గాంధీని కూడా ప్రచారానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భారీ సంఖ్యలో ఏఐసీసీ పెద్దలు రాష్ట్రంలో పర్యటించి తెరాస విజయానికి అడ్డుకట్ట వేయాలని స్కెచ్ గీస్తున్నారు.

ఇవే కాకుండా తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో..లోకసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రజలకు వివరించబోతోంది. తెరాసకు ఓటు వేస్తే అది బీజేపీకే వేసినట్లవుతుందన్న విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లబోతోంది.

ఇవీ చూడండి:మహబూబాబాద్​లో గిరిపుత్రుల నాయక్ ఎవరు..?

ABOUT THE AUTHOR

...view details