15 రోజుల అంతర్మథనం అనంతరం మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ భాజపాలో చేరారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సైద్ధాంతిక విధానం, ప్రాంతీయ భావజాలం లేని కాంగ్రెస్‌లో ఉండలేకపోయానని రాపోలు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవం, దేశ సమగ్రత కోసమే భాజపాలో చేరానని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, చేనేత కార్మికుల కోసం కృషి చేస్తానన్నారు.
కమలం గూటికి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ - congress
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. 15 రోజుల క్రితం హస్తం వీడిన మాజీ ఎంపీ ఆనంద భాస్కర్ భాజపాలో చేరారు.
![కమలం గూటికి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2898977-287-d17748a0-dad7-47b8-806c-1a60c3c5f099.jpg)
కమలం గూటికి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్