తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​ పలుకులు వినడానికేనా సభ: భట్టి - congress

అప్రజాస్వామికంగా తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో స్పీకర్​ ఎలా నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు నిలదీశారు.

"అప్రజాస్వామికంగా 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు"

By

Published : Jul 18, 2019, 5:09 PM IST

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అప్రజాస్వామికంగా తమ పార్టీకి చెందిన 12మంది ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకున్నారని మండిపడ్డారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలదండ వేయాలని చెప్పినా వినకుండా తాళంతో బంధించారని భట్టి ఆక్షేపించారు. రాష్ట్రంలో చాలా సమస్యలున్నా వాటి మీద చర్చించకుండా .... కేసీఆర్‌కు ఇష్టమైన పలుకులు వినడానికే సభను ఏర్పాటు చేసుకున్నట్లుగా ఉందని దుయ్యబట్టారు. తమకు సభలో మైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం కోర్టులో ఉన్న అంశంపై స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు నిలదీశారు. కేసీఆర్‌కు మున్సిపల్‌ ఎన్నికల మీద ఉన్న శ్రద్ద ప్రజా సమస్యల మీదలేదని ఆరోపించారు. అసెంబ్లీ సెషన్‌ను పొడిగించి ప్రజా సమస్యలపై చర్చ పెట్టాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.

"అప్రజాస్వామికంగా 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు"

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details