కోడి రామకృష్ణ మృతితో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. నటులు, దర్శకులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బయటెక్కడ కనిపించినా చిరుమందహాసంతో పలకరించేవారని నటుడు జగపతిబాబు అన్నారు. కోడి రామకృష్ణ సినీ పరిశ్రమకు చేసిన సేవలు ఎనలేనివని సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కొనియాడారు.
సినీప్రముఖుల నివాళి - సంగీత దర్శకుడు కోటి
దర్శకుడు కోడి రామకృష్ణకు సినీనటులు జగపతిబాబు, కైకాల సత్యనారాయణ, కృష్ణంరాజు, సంగీత దర్శకుడు కోటితో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
నివాళులర్పించిన జగపతిబాబు, కైకాల సత్యనారాయణ
అలాంటి దర్శకుడు పుట్టాలంటే మళ్లీ ఆయనే పుట్టాలన్నారు సంగీత దర్శకుడు కోటి. ఒక దర్శకునిగా కంటే తెలుగు చిత్రసీమ ఓ గొప్ప వ్యక్తిని కొల్పోయిందని నటుడు కృష్ణంరాజు తెలిపారు. కోడి రామకృష్ణతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Last Updated : Feb 23, 2019, 12:27 PM IST