అప్పుచేసి వ్యాపారం చేయడం సహజమే... కానీ చెల్లించకపోవడం వల్ల రుణదాత, గ్రహీత మధ్య వివాదం తలెత్తుతోందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ అన్నారు. 2016 దివాల చట్టంతో సంస్థలపై చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్లో ఓ హోటల్లో రాష్ట్ర న్యాయ సేవా సంస్థ, లీగల్ డైలాగ్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహించిన కార్పొరేట్ సంస్థల దివాల చట్టం-తీరుతెన్నులపై అవగాహన సదస్సుకు... ఎన్సీఎల్టీ ఛైర్మన్ ముఖోపాధ్యాయతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, కంపెనీ సెక్రటరీలు పాల్గొన్నారు.
దివాలా సంస్థలతో ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం: జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ - nclt chairman mukhopadyaya
దివాలా ప్రకటించే కార్పొరేట్ సంస్థల వల్ల ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారే ప్రమాదముందని హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. ఇలాంటివి నియంత్రించేందుకు కఠిన చట్టాలు తెచ్చి శిక్షించాలన్నారు.
దివాళా సంస్థలతో ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం