బయోలాజికల్ ప్రయోగాల్లో ఎప్పటికప్పుడు కొత్త ఒరవడిని సృష్టిస్తున్న సీసీఎంబీ మరో ప్రయోగానికి తెరతీసింది. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, హ్యూమనీ సొసైటీ ఇంటర్నేషనల్ వారి సహకారంతో సెంటర్ ఫర్ ప్రిడిక్టివ్ హ్యూమన్ మోడల్ సిస్టమ్స్ కేంద్రాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మందుల పరీక్ష మరింత సులభం కానుంది. ఇప్పటి వరకు తయారు చేసిన మందులను జంతువులపై ప్రయోగించే వారు అయితే.... అందుకు భిన్నంగా సీసీఎంబీలో తయారవుతున్న మీనియేచర్ హ్యూమన్ ఆర్గాన్ల మీద మందులను ప్రయోగించేందుకు గురువారం ఎంఓయూ కుదుర్చుకున్నారు. మానవ శరీరం నుంచి తీసిన కణాలతో రూపొందించిన అవయవాలపై మందుల ప్రయోగాలను చేయటం వల్ల జంతువులను కాపాడినట్టవుతుందని వారు అభిప్రాయపడ్డారు. సీసీఎంబీ చెబుతున్న గ్రీన్ మీట్ ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కనుంది. ఇందుకోసం ప్రభుత్వం నాలుగున్నర కోట్లు కేటాయించినట్లు సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ కే మిశ్రా ప్రకటించారు.
సీసీఎంబీ ప్రయోగాల నుంచి జంతువులకు విముక్తి - ccmb mou
నూతన ఆవిష్కరణలకు సీసీఎంబీ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పటి దాకా తయారుచేసిన మందులు జంతువులపై ప్రయోగించేవారు. వికటిస్తే జంతువులు బలవుతున్నాయని... మీనియేచర్ హ్యూమన్ ఆర్గాన్ల మీద ప్రయేగించేందుకు ఎంఓయూ కుదుర్చుకున్నారు.
సీసీఎంబీ ప్రయోగాల నుంచి జంతువులకు విముక్తి