తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ మూడు కొట్టాల్సిందే... గ్రేటర్​పై యువనేత దృష్టి - 2019 elections

రాష్ట్రంలో ఏ ఎన్నికలైనా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సత్తాచాటడమే అసలైన విజయంగా అధికార పార్టీ శక్తియుక్తులు ఉపయోగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నితానై గులాబీ శ్రేణులను ముందుకు నడిపించిన కేటీఆర్‌... లోక్‌సభ పోరులోనూ కొంగొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, చేవెళ్ల పార్లమెంటు స్థానాల్లో కారును పరిగెత్తించి... మరోసారి సత్తా చాటాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.

గ్రేటర్ హైదరాబాద్​పై కేటీఆర్ నజర్

By

Published : Apr 8, 2019, 6:09 AM IST

గ్రేటర్ హైదరాబాద్​పై కేటీఆర్ నజర్

2014 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా గులాబీ పార్టీ గణనీయంగానే గెలిచినప్పటికీ... నగరంలో మాత్రం 24 స్థానాల్లో పోటీ చేసి 3 స్థానాల్లోనే గెలిచింది. అప్రమత్తమైన కేసీఆర్‌ నగరంపై ప్రత్యేక దృష్టిపెట్టి... బల్దియా ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేసేలా మంత్రి కేటీఆర్‌కు బాధ్యత అప్పగించారు. 150 డివిజన్లకుగాను 99 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి పూనుకున్న కేటీఆర్​... చాలా రోజుల ముందు నుంచే కార్యక్షేత్రంలోకి దిగి అసెంబ్లీ ఎన్నికలకు క్యాడర్​ను సమాయత్తం చేశారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారాల దాకా అన్నీ తానై వ్యవహరించి... భాజపాకు పట్టున్న అంబర్​పేట, ముషీరాబాద్​తో పాటు 14స్థానాల్లో గులాబీ జెండా ఎగరవేశారు. ఫలితంగా కేటీఆర్​కు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పదోన్నతి దక్కింది.

తెరాస ఇంతవరకూ ఖాతా తెరవని మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ లోక్​సభ స్థానాల్లో గులాబీ జెండా ఎగరవేయాలనే పట్టుదలతో కేటీఆర్​ ఉన్నారు. సన్నాహక సభలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ప్రచారంలో సహకరించడం లేదని తెలుస్తోంది. అప్రమత్తమైన కేటీఆర్​ గ్రేటర్​పై ప్రత్యేక నజర్ పెట్టారు. విభేదాలు పక్కనపెట్టి... అందరు కలిసికట్టుగా పార్టీని గెలిపించాలని సూచించారు. నేతల పనితీరును బట్టే.. భవిష్యత్ అవకాశాలుంటాయని సుతిమెత్తగా హెచ్చరించారు.

ఇవీ చూడండి: ఆదివాసీల చేతిలోనే ఆదిలాబాద్ అభ్యర్థి భవిష్యత్

ABOUT THE AUTHOR

...view details