తెలంగాణ

telangana

ETV Bharat / state

బంజారాహిల్స్ కాలనీ వాసుల ధర్నా - drinage

బంజారాహిల్స్​లోని ఎమ్మెల్యే కాలనీలో స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. కాలనీ డ్రైనేజీ వ్యవస్థలోనే పెద్ద పెద్ద ఆసుపత్రుల వ్యర్థ పదార్థాలు కలపడం వల్ల డ్రైనేజీ పొంగుతోందన్నారు. పరిశుభ్రమైన కాలనీ కావాలంటూ ధర్నా నిర్వహించగా కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

బంజారాహిల్స్ కాలనీ వాసుల ధర్నా

By

Published : Jul 6, 2019, 2:51 PM IST

బంజారాహిల్స్​లోని ఎమ్మెల్యే కాలనీలో స్థానికులు ధర్నా చేపట్టారు. కాలనీలో ఒమేగా ఆసుపత్రి నుంచి వెలువడే జీవ సంబంధ వ్యర్థ పదార్థాల వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదముందని ఆందోళన చేపట్టారు. కాలనీకి ఉండే డ్రైనేజీ వ్యవస్థలోనే పెద్ద పెద్ద ఆసుపత్రుల నుంచి వెలువడే బయో వ్యర్థ పదార్థాలను కలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశుభ్రమైన కాలనీ కావాలని ధర్నా నిర్వహించగా రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి.

బంజారాహిల్స్ కాలనీ వాసుల ధర్నా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details