తెలంగాణ

telangana

ETV Bharat / state

'మళ్లీ ఫైటర్ పైలెట్ గానే'

వింగ్ కమాండర్ అభినందన్​కు అన్ని కోణాల్లో వైద్య పరీక్షలు చేసిన అనంతరం తిరిగి రెండు, మూడు నెలల్లో మళ్లీ యుద్ధ విమానాలను నడిపే అవకాశం ఉందని మాజీ లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్​కే రెడ్డి అభిప్రాయపడ్డారు.

By

Published : Mar 2, 2019, 4:38 PM IST

'మళ్లీ ఫైటర్ పైలెట్ గానే'

రెండు, మూడు నెలల్లో మళ్లీ యుద్ధ విమానాలను నడిపే అవకాశం ఉంది
పాకిస్థాన్ నుంచి విడుదలైన వింగ్ కమాండర్ అభినందన్... రెండు, మూడు నెలల్లో మళ్లీ యుద్ధ విమానాలను నడిపే అవకాశం ఉందని మాజీ లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్​కే రెడ్డి అభిప్రాయపడ్డారు. అభినందన్​కు దిల్లీలో పూర్తిస్థాయిలో అన్ని కోణాల్లో వైద్య పరీక్షలు చేసిన అనంతరం... ఆయన మానసిక స్థితి ఇతర ఆరోగ్య పరిస్థితులు చూశాక విధుల్లో నియమించే అవకాశం ఉందన్నారు.

నచికేత​ను చేసినట్లే...

గతంలో కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్థాన్​కు చిక్కిన నచికేత​ను కూడా అప్పట్లో ఎనిమిది రోజులకు విడుదల చేసింది. కానీ ఆయన ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల అతన్ని ట్రాన్స్​పోర్టు పైలట్​గా నియమించినట్లు ఏఆర్​కే రెడ్డి గుర్తు చేశారు. అభినందన్​కు అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి:వీరుడికి ఘనస్వాగతం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details