తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐస్​గోలా తాతకు కేటీఆర్ సాయం ​ - సాయం

చిన్నప్పుడు తాను చదువుకున్న ఆబిడ్స్​ గ్రామర్​ స్కూల్​లో ఐస్​గోలా అమ్మిన సయ్యద్​ అలీ దీన స్థితిని చూసి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ చలించిపోయారు. ఆయనకు ఇల్లు, వృద్ధాప్య పింఛను మంజూరు చేయిస్తానని, కుమారులకు ఉపాధి కల్పిస్తానని భరోసా ఇచ్చారు.

ఐస్​గోలా తాతకు కేటీఆర్ సాయం ​

By

Published : Feb 15, 2019, 10:42 AM IST

ఐస్​గోలా తాతకు కేటీఆర్ సాయం ​
కేటీఆర్​కు సయ్యద్​ అలీకి సంబంధించిన సమాచారాన్ని మహాబూబ్​ అలీ అనే వ్యక్తి ఇటీవలే ట్విట్టర్​లో ఇచ్చారు. ఆయనను కలిసే అవకాశం ఇవ్వాలని కోరగా కేటీఆర్​ అంగీకరించారు. గురువారం ఇంటికి ఆహ్వానించి ఆలింగనం చేసుకొని కుశల ప్రశ్నలు వేశారు. కుటుంబ పరిస్థితి, ఆరోగ్యం, పిల్లలు ఏం చేస్తున్నారంటూ వాకబు చేశారు. గతేడాదే గుండె శస్త్ర చికిత్స జరిగిందని... ఇప్పటికీ అక్కడే ఐస్​గోలాలు అమ్ముతున్నానని సయ్యద్​ అలీ తెలిపారు. వెంటనే కేటీఆర్​ ఆయనకు ఒక ఇల్లు, వృద్ధాప్య పింఛను కోసం అధికారులతో మాట్లాడారు. 30 ఏళ్ల క్రితం గ్రామర్​ స్కూల్​లో ఐస్​ అమ్మిన తనను గుర్తుంచుకొని సాయం చేయండంపై కేటీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details