ఇంటర్మీడియట్ బోర్డు బాధిత కుంటుంబాలను ఆదుకునేందుకు అఖిలపక్షం నేతలు ఈ నెల 29న భిక్షాటన చేయనున్నట్లు ప్రకటించారు. విద్యార్థి, యువజన, ప్రజాసంఘాలతో కలిసి చార్మినార్ నుంచి ఇంటర్ బోర్డు కార్యాలయం వరకు భిక్షాటన చేయనున్నట్లు తెలిపారు. హైకోర్టు తీర్పుపై భవిష్యత్ కార్యచరణను చర్చించేందుకు అఖిపక్ష నేతలు సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూం భవన్లో సమావేశమయ్యారు. ఇంటర్ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేశారు. విద్యార్థులు చనిపోతే ముఖ్యంత్రికి చీమ కుట్టినట్లైనా లేదని విమర్శించారు.
ఇంటర్ బాధితుల కోసం అఖిలపక్షం భిక్షాటన - ravula
ఇంటర్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు అఖిలపక్ష నేతలు నడుం బిగించారు. విద్యార్థి, యువజన, ప్రజాసంఘాలతో కలిసి భిక్షాటన చేయాలని నిర్ణయించారు. పసి మొగ్గలు చనిపోతుంటే ప్రభుత్వం స్పందించకపోవటం సిగ్గుచేటన్నారు.
ఇంటర్ బాధితుల కోసం అఖిలపక్షం భిక్షాటన