మాదక ద్రవ్యాల కేసుపై వచ్చిన వార్తలపై ఎక్సైజ్ శాఖ స్పందించింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డ్రగ్స్ కేసు పురోగతి అడిగిన విషయం నిజమే అయినప్పటికీ అది గతేడాది జూన్ 13న సమర్పించిందని వెల్లడించారు. మాదక ద్రవ్యాల కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు.
డ్రగ్స్ కేసుపై వార్తలు పాతవే: అకున్ సబర్వాల్ - undefined
టాలీవుడ్ చిత్రసీమను రెండేళ్ల క్రితం కుదిపేసిన డ్రగ్స్ కేసులో ప్రస్తుతం వస్తున్న వార్తలపై అకున్ సబర్వాల్ స్పందించారు. మాదక ద్రవ్యాల కేసులో పురోగతి ఉందన్నారు.
డ్రగ్స్ కేసుపై వార్తలు పాతవే: అకున్ సబర్వాల్
2018 జూన్ 13నాటికి డ్రగ్స్ కేసులో 4ఛార్జీషీట్లు ఫైల్ చేశామని తెలిపారు. ఈ వ్యవహారంలో మరికొన్ని ఛార్జీషీట్లు వేయాల్సి ఉందన్నారు అకున్ సబర్వాల్. ప్రస్తుతం మీడియాలో వస్తున్న సమాచారం ఇప్పటిది కాదని కొట్టిపారేశారు.
ఇవీ చూడండి:నీటిలో తగ్గిన ప్రాణవాయువు.. మరణశయ్యపై మీనాలు
TAGGED:
akun