రేపు ఉదయం హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంటు అభ్యర్ధులతో భేటీ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు రాష్ట్రానికి రానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని హోటల్‌లో బస చేస్తారు. రేపు ఉదయం హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థులతో సమవేశమవుతారు. నియోజకవర్గాల్లో తాజా పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. మూడు సభలకు హాజరు...
మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్లో జహీరాబాద్‌కు చేరుకుని బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం వనపర్తిలో జరిగే ప్రచారసభకు హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5.50 గంటలకు హైదరాబాద్ చేరుకుని దిల్లీకి పయనమవుతారు.
భారీ ఏర్పాట్లు..
రాహుల్ సభలను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం రాష్ట్రంలో పార్టీ తరఫున జరుగుతున్న భారీ కార్యక్రమం రాహుల్ పర్యటనే. ఏప్రిల్ ఎనిమిదిన ఒకట్రెండుసభల్లో పాల్గొనేందుకు రాహుల్ అంగీకరించినట్లు సమాచారం. గతంలో రాహుల్ సభలు ఏర్పాటు చేయని నియోజకవర్గాల్లో మిగిలిన సభలు నిర్వహించాలని హస్తం పార్టీ యోచిస్తొంది.
ఇవీ చూడండి:ఈసీ నిర్ణయం ప్రకారమే ఇందూరు ఎన్నికలు