తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖరారైన రాహుల్​ పర్యటన, ఒకే రోజు 3 సభలు - AICC CHEEF RAHUL GANDHI CAME TO TELANGANA FOR ELECTION CAMPAIGN

పార్లమెంట్​ ఎన్నికల ప్రచార జోరును పెంచేందుకు కాంగ్రెస్​ సిద్ధమైంది. పార్టీ నేతలు చేజారిపోతున్న తరుణంలో శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రణాళిక రచించింది. ఈ క్రమంలోనే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ పర్యటనను అధిష్ఠానం ఖరారు చేసింది.  ఏప్రిల్​ ఒకటిన జరిగే మూడు సభలకు రాహుల్​ హాజరుకానున్నారు.

ఏప్రిల్​ ఒకటిన రాష్ట్రానికి రాహుల్​

By

Published : Mar 27, 2019, 3:40 PM IST

Updated : Mar 27, 2019, 3:54 PM IST

ఏప్రిల్​ ఒకటిన రాష్ట్రానికి రాహుల్​
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. పార్లమెంట్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్​ ఒకటిన రాహుల్​ రాష్ట్రానికి రానున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు జహీరాబాద్​లో జరిగే ప్రచార సభకు హాజరవుతారు. అనంతరం నాగర్​కర్నూల్​ నియోజకవర్గంలోని వనపర్తిలో రెండు గంటలకు జరిగే సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి నల్గొండ చేరుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు హుజూర్​నగర్​ సభలో ప్రసంగిస్తారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​రెడ్డి తెలిపారు.
Last Updated : Mar 27, 2019, 3:54 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details