తెలంగాణ

telangana

ETV Bharat / state

2041కి తెలంగాణలో పెరగనున్న వృద్ధుల సంఖ్య - పెరగనున్న వృద్ధుల సంఖ్య

తెలుగు రాష్ట్రాలు భవిష్యత్తులో జనాభా సంక్షోభాన్ని ఎదుర్కోనున్నాయా? ప్రస్తుతం జపాన్‌ తరహాలో పని చేయగలిగే యువత సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరగనుందా? యువత సంఖ్య భారీగా తగ్గిపోనుందా? 2041 కల్లా ఆంధ్రప్రదేశ్‌లో జనాభా వృద్ధి రేటు సున్నాకు చేరనుందా.. అంటే అవుననే అంటోంది ఆర్థిక సర్వే.

2041కి తెలంగాణలో పెరగనున్న వృద్ధుల సంఖ్య

By

Published : Jul 5, 2019, 7:49 AM IST

తెలుగు రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి మెరుగుపడింది. ఆయుఃప్రమాణాలు పెరుగుతున్నాయి. వీటితో పాటు మరెన్నో వాస్తవాలను ఈ సర్వే కళ్లకు కట్టింది. ఈ చేదు నిజాలతోపాటు కొన్ని తీపి కబుర్లనూ అందించింది. మరణ శాతాలు తగ్గుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2041 నాటికి జనాభా వృద్ధిరేటు సున్నాకు చేరుతుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. వచ్చే 2 దశాబ్దాల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో యుక్తవయస్కుల సంఖ్య 10% తగ్గిపోయి 60 ఏళ్ల పైబడిన వయోవృద్ధుల సంఖ్య పెరుగుతుందని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం పార్లమెంటులో 2018-19 ఏడాది ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. అందులో వివరాలు.

  • 2015-16 నుంచి 2018-19 మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో లింగనిష్పత్తి పురోగమనంలో సాగింది. భేటీ బచావో- భేటీ పఢావో కార్యక్రమం పెద్ద రాష్ట్రాలపై మంచి ప్రభావాన్ని చూపింది. లింగనిష్పత్తి 980కి మించి ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ చేరాయి. 2015-16 నాటికి ఏపీలో ఈ నిష్పత్తి 873 లోపు ఉంది.
  • 5- 14 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో బడికి వెళ్లేవారి సంఖ్య దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతూ వస్తోంది.
  • ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌లలో 40% ప్రాథమిక పాఠశాలల్లో 50%కంటే తక్కువ పిల్లలున్నారు.
  • ఏపీలో 2001లో సగటు సంతాన సాఫల్య నిష్పత్తి 2.3% ఉండగా 2041 నాటికి అది 1.5%కి చేరనుంది. తెలంగాణలోనూ ఇది 2.3% నుంచి 1.6%కి చేరే అవకాశం కనిపిస్తోంది.
    2041కి తెలంగాణ ఆర్థిక సర్వే అంశాలు
    2041కి తెలంగాణ ఆర్థిక సర్వే అంశాలు

ABOUT THE AUTHOR

...view details