తెలంగాణ

telangana

ETV Bharat / state

17 స్థానాలు గెలవాల్సిందే: కేసీఆర్​ - trslp meeting

పార్లమెంటు ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాల్లో గెలవాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్​ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్​లో జరిగిన శాసనసభాపక్ష భేటీలో ఎమ్మెల్యేలు నమూనా ఎమ్మెల్సీ ఓటింగ్​లో పాల్గొన్నారు.

తెలంగాణ భవన్​లో టీఆర్​ఎస్​ఎల్పీ సమావేశం

By

Published : Mar 11, 2019, 4:40 PM IST

తెలంగాణ భవన్​లో సీఎం కేసీఆర్​ అధ్యక్షతన తెరాస శాసనసభాపక్ష సమావేశంజరిగింది.శాసనసభ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నమూనా పోలింగ్​ నిర్వహించారు.రేపు ఉదయం 8 గంటలకు మరోసారి మాక్​పోలింగ్​ నిర్వహించాలని నిర్ణయించారు. లోక్​సభ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలకు సీఎంకేసీఆర్​దిశానిర్దేశం చేశారు. ఈ నెల 17న కరీంనగర్​, 19న నిజామాబాద్​లో భారీ బహిరంగ సభలను నిర్వహించాలని... ఒక్కో సభకు 2 లక్షలకు తగ్గకుండా జన సమీకరణ చేయాలన్నారు.ఎంపీలను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని అన్నారు. ఎంఐఎంతో కలిసి మొత్తం 17 స్థానాల్లో గెలవాల్సిందేనని స్పష్టం చేశారు.

తెలంగాణ భవన్​లో టీఆర్​ఎస్​ఎల్పీ సమావేశం

ABOUT THE AUTHOR

...view details