భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని ఇందిరా నగర్ పంచాయతీలో రూ. 10లక్షల వ్యయంతో నిర్మించిన అంతర్గత రహదారులను జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య ప్రారంభించారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలపై దృష్టి పెడుతూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.
'పట్టణాలతో పాటు గ్రామాల అభివృద్ధే తెరాస ప్రభుత్వ ధ్యేయం' - ఇల్లందులోని అంతర్గత రోడ్లు
తెరాస ప్రభుత్వం పట్టణాలతో పాటు గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగుతోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య పేర్కొన్నారు. ఇల్లందు మండలంలోని అంతర్గత రహదారులను ఆయన ప్రారంభించి.. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
'పట్టణాలతోపాటు గ్రామాల అభివృద్ధే తెరాస ప్రభుత్వ ధ్యేయం'
కొవిడ్ సమయంలోనూ అభివృద్ధి పనులు ఆగకుండా జాగ్రత్తలు పాటిస్తూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకూ ఆర్థిక ప్రయోజనాలు చేకూరే విధంగా తెరాస ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లలిత, ఎంపీటీసీలు, ఇతర పంచాయితీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.
TAGGED:
ఇల్లందులోని అంతర్గత రోడ్లు