ప్రేమించకపోతే యాసిడ్ పోస్తానని బెదిరించడాని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని స్టేషన్ బస్తీలో ఒంటరిగా ఉన్న యువతిపై ప్రేమించకపోతే రసాయన ద్రావణం పోస్తానని ఓ వ్యక్తి బెదిరించాడని బాధితురాలు పేర్కొంది. తాను ప్రతిఘటించి బయటకి వచ్చి కేకలు వేయగా వెళ్లిపోయాడని ఇల్లందు పోలీస్ స్టేషన్లో బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి ఫిర్యాదు చేసింది.
ఒంటరిగా ఉన్నపుడు ఇంట్లోకి యువకుడు చొరబడి భయబ్రాంతులకు గురి చేశాడని పేర్కొంది. యువకుడి తరుఫు వారు తమ పైన ఫిర్యాదు చేస్తావా అని బెదిరింపులు పాల్పడుతున్నారని ఆరోపించింది. తమకు న్యాయం చేయాలని యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.