లాక్డౌన్ సమయంలో నిరుపేదలకు వికలాంగులకు తనవంతు సాయం చేస్తూ... అండగా నిలుస్తున్నాడు సలీం అనే యువకుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన సలీం... కొత్త బస్టాండ్ సెంటర్లో మిర్చి బండి నిర్వహిస్తుంటాడు. సలీం సహజంగానే సమాజ సేవకుడిగా పలువురికి సాయం చేస్తుంటాడు.
పేదలకు అండగా నిలుస్తోన్న మిర్చి బండి అబ్బాయి - LOCK DOWN EFFECTS
చేసేది వేలకు వేలు వచ్చే ఉద్యోగం కాదు... అలాగని ఆస్తులూ ఏమీ లేవు... బ్యాక్గ్రౌండ్ కూడా లేదు.. బస్టాండ్ సెంటర్లో మిర్చిలు అమ్ముకుంటాడు. అయినా... తన సమాజ సేవ చేయాలన్న తన తపనకు ఇవేవి అడ్డు కాదు.. ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితిలో తనకున్నంతలో నిరుపేదలకు సాయమందిస్తూ... ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇల్లందు యువకుడు.
పేదలకు అండగా నిలుస్తోన్న మిర్చి బండి అబ్బాయి
లాక్డౌన్ కారణంగా పలువురు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రహించిన సలీం... తన మిత్రులతో కలిసి వికలాంగులు, ఆటో డ్రైవర్లు, వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారికి, వృద్ధులకు భోజనం అందిస్తూ అండగా నిలుస్తున్నాడు. కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న వారికి తనకు తోచిన సాయాన్ని చేస్తున్నట్టు సలీం తెలిపాడు. మనుషులకే కాదు... తిండిలేక దీనంగా చూస్తోన్న కోతులకు సైతం తినుబండారాలు అందిస్తున్నాడు.