తెలంగాణ

telangana

ETV Bharat / state

CORONA: ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియకు కరోనా పాజిటివ్​ - తెలంగాణ వార్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌కు కరోనా నిర్ధరణ అయింది. రెండ్రోజులుగా నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె... అనారోగ్యంతో కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. ఆమెకు వైరస్ సోకినట్లు వైద్యులు తెలిపారు.

mla haripriya corona, covid
ఎమ్మెల్యే హరిప్రియకు కరోనా, కొవిడ్

By

Published : Jul 3, 2021, 1:53 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కొవిడ్ బారిన పడ్డారు. రెండు రోజులుగా నియోజకవర్గంలో హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. అనారోగ్యంతో ఉన్న ఎమ్మెల్యేకి ప్రభుత్వ వైద్యులు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా... పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.

శాసనసభ్యురాలికి కరోనా సోకడంతో మిగతా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత వారం రోజులుగా హరిప్రియతో పాటు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్థులు కలవరపడుతున్నారు. ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని కార్యకర్తలు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఇదీ చదవండి:AP MLA SRIDEVI: ఏపీ ఎమ్మెల్యే శ్రీదేవి రాజీనామా చేయాలని రైతుల డిమాండ్

ABOUT THE AUTHOR

...view details