భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే హరిప్రియ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు పండుగలు చేసుకునే విధంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఎందరో చేనేత కార్మికులకు ఉపాధి కూడా లభిస్తోందని ఆమె అన్నారు.
బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే హరిప్రియ - బతుకమ్మ చీరల పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరూ పండుగలు చేసుకునే విధంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. ఇల్లందులో చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
చీరలను కూడా ఎంతో నాణ్యతతో ప్రభుత్వం తయారు చేయించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఒకప్పుడు ఉపాధి అవకాశాలు లేక చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయని... ఇప్పుడు బతుకమ్మ చీరల తయారీతో ఏడాది పొడవునా కార్మికులకు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని ఎమ్మెల్యే హరిప్రియ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో విద్యాలత, జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ రాజేందర్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన మంత్రి గంగుల