భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌కు అభిమానులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్రేన్ సాయంతో హరిప్రియకు గజమాల సమర్పించారు.
ఇల్లందులో ఎమ్మెల్యే హరిప్రియ జన్మదిన వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ జన్మదిన వేడుకలను కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. క్రేన్ సాయంతో ఆమెకు గజమాలను సమర్పించారు.
ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ పుట్టిన రోజు
బాలాజీనగర్‌లోని సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ నుంచి హరిప్రియకు లేఖ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మే డే పురస్కరించుకుని సింగరేణి ఉపరితల గని సమీపంలో హరిప్రియ జెండా ఆవిష్కరణ చేశారు.