భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి కాలనీలో ఏరియా జనరల్ మేనేజర్ పీవీ సత్యనారాయణ పర్యటించారు. కాలనీవాసులకు తడి పొడి చెత్తబుట్టలను అందజేశారు. ఇటీవల సింగరేణి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ప్రాంతాల్లో స్వచ్ఛత మహా కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కార్యాలయాలు, కాలనీలు, పాఠశాలలను పరిశుభ్రం చేశామని.. భవిష్యత్తులోనూ ఇదే ధోరణితో పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
కాలనీల్లో చెత్తను బయట వేయరాదని... అలా ఉల్లంఘించిన వారికి 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు జరిమానా విధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.
'చెత్త బయట వేస్తే 500 నుంచి 1000 రూపాయల జరిమానా' - singareni
ఇల్లందులోని సింగరేణి కాలనీలో ఏరియా జనరల్ మేనేజర్ పీవీ సత్యనారాయణ తడి పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. చెత్త బయట వేస్తే 500 నుంచి 1000 రూపాయల జరిమానా విధిస్తామని ఆయన ప్రకటించారు.
'పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి'